జిల్లాలో భారీ వర్షాలతో పొంగిన వాగులు

 

జిల్లాలో భారీ వర్షాలతో పొంగిన వాగులు

ఒంగోలు సెప్టెంబర్ 26 న్యూస్ మేట్
గురువారం రాత్రి నుండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి జిల్లా పశ్చిమ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మార్కాపురం డివిజన్ ఒంగోలు డివిజన్ కందుకూరు డివిజన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి .జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్ లో ఒకటైన రాళ్లపాడు ప్రాజెక్టు సమృద్ధిగా నీరు చేరింది. మార్కాపురం డివిజన్లోని గుండ్లకమ్మ నది ఉదృతంగా ప్రవహిస్తున్న ది .కంభం మండలంలోని రావిపాడు వద్ద ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగు లో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ట్రాక్టర్ లో లో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు . పోలీసు, పైర్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బేస్తవారిపేట మండలం పెంచికలపాడు సమీపంలో కొత్తచెరువు వాగులో అంకయ్య అనే వ్యక్తి వాగులో చిక్కుకున్నాడు .సమాచారం అందుకున్న బేస్తవారిపేట ఎస్ ఐ బాలకృష్ణ అంకయ్యను సురక్షితంగా కాపాడారు. బల్లికురవ మండలం అంబడిపూడి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న తూర్పు వాగులో ఇద్దరు విద్యార్థులు చిక్కుకున్నారు. ఒక విద్యార్థి నీటి ప్రవాహానికి కొట్టుకుపోగా మరో విద్యార్థిని గ్రామస్తులు రక్షించారు.
నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో చెరువు కట్ట తెగిపోయి వరద నీరంతా ఎస్టీ కాలనీలో చేరింది . ఒంగోలు గ్రామీణ సి ఐ సుబ్బారావు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అదే సందర్భంలో పల్లె వెలుగు బస్సు ప్రమాదవశాత్తు కుంటలో ఒరిగింది .ప్రయాణికులను బస్సు నుండి దించి వేశారు. ఇలా ఉండగా ఫలిత ముంపుకు గురైన ప్రాంతంలో సిపిఎం నాయకులు సహాయక చర్యలు చేపట్టారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *