కథనాలకు స్పందించిన కమిషనర్ డి వి ఎస్ నారాయణ రావు

 

 


కథనాలకు స్పందించిన కమిషనర్ డి వి ఎస్ నారాయణ రావు.

కనిగిరి, సెప్టెంబర్ 26 ,న్యూస్ మేట్:

దినపత్రికలో ప్రచురితమైన నాగుల చెరువు ఆక్రమణ అక్రమాలపై మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణ రావు తీవ్రంగా స్పందించారు. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి వాగుపై నిర్మాణాలకి తయారుచేసిన గ్రావెల్ ని జెసిబి తో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి నగర పంచాయతీ పరిధిలో అక్రమార్కులు వాగులు వంకలు పూడ్చి ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్తులకు ఎవరు ఆటంకం కలిగించినా ఉపేక్షించబోమని వెల్లడించారు. ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల తో వెంటనే చర్యలు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇకపై కబ్జాలకు ఎవరైనా పాల్పడితే జరిమానాలు విధించడమే కాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని త్వరలో నాగుల చెరువు లో చేసిన అక్రమాలను పరిశీలించి వాటి పైన కూడా చర్యలు తీసుకుంటామని కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన తెలియజేశారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణకు పత్రికలు నిఘా ఉంచడం అక్రమాలను వెలికి తీయడం అభినందనీయమని ఆయన అన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *