గిరిజన ప్రాంతంలో లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం.. ఆరోగ్య శాఖ మంత్రి నాని వెల్లడి
పెద్దదోర్నాల అక్టోబర్ 1 (న్యూస్ మేట్): అటవీ ప్రాంతంలో ప్రజలు దూరప్రాంతాలకు ఆరోగ్య సమస్యలు పరిష్కారం కోసం ఇకనుండి వెళ్ళవలసిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర మంత్రులు ఆదిమూలం సురేష్ బాలినేని శ్రీనివాసరెడ్డి లతో కలిసి పెద్దదోర్నాల మండలం ఐయిన ముక్కుల గ్రామం లో గ్రామ ప్రజలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చిన స్థలాన్ని పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి 1078 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు .అయినవోలు గ్రామంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసంరాష్ట్ర ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. లక్ష చదరపు అడుగుల స్థలంలో సూపర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం త్వరలో జరుగుతుందని ఆయన చెప్పారు.రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలు ఎక్కడున్నా గానీ అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అందులో భాగంగానే ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం నిర్మించి గ్రామంలోని ప్రజలు సేవలందిస్తున్నారు అని వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు నుంచి ప్రతి గిరిజన పేద ప్రజలకు మరియు వైద్య విద్య వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థలాన్ని విరాళంగా ఇచ్చిన గ్రామ ప్రజలకు రాష్ట్రమంత్రులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జాయింట్ కలెక్టర్ చేతన్ మార్కాపురం ఆర్డిఓ శేషి రెడ్డి దోర్నాల ఎమ్మార్వో ఏ వి హనుమంతరావు మాజీ జెడ్పీటీసీ సభ్యులు అమ్మి రెడ్డి రామ్ రెడ్డి వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు