రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తూ మూడవరోజు సిపిఐ సిపిఎం నిరసన దీక్షలు.

01/10/20రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తూ మూడవరోజు సిపిఐ సిపిఎం నిరసన దీక్షలు.
కందుకూరు అక్టోబర్ 1 ( న్యూస్ మేట్) : రై తాంగంమేఅతివృస్టి,అనావృస్టి కారణంగా అల్లాడుతుంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని తీవ్రమైన కష్టాల్లోకి నెట్టేవిధంగా వ్యవహరిస్తున్నాయని ,సీపీఐ సిపిఎం రైతు సంఘాల నేతలు కే.వీరారెడ్డి మాదాల రమణయ్య లు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లును తక్షణరై  తాంగంమే రద్దు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో కందుకూరు సబ్ కలెక్టరు ఆఫీసు వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 3వ రోజు కొనసాగినవి.ఈ కార్యక్రమానికి సీపీఎం గుడ్లూరు ప్రాంతీయ కార్యదర్శి జీవీబీ కుమార్, సీపీఐ నియోజిక వర్గ నాయకులు బి.సురేశ్ బాబు అధ్యక్షత వహించారు.ఈ దీక్షల ను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించడం,రైతాంగం ను కార్పోరేట్లకు కట్టబెట్టే వ్యవసాయ బిల్లు లను పార్లమెంటులో రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించే జీ.వో నెంబరు 22 ను తీసుకుని రావటం రైతాంగ వ్యతిరేక చర్యలని విమర్శ చేశారు.వీటి రద్దు కోసం మరో స్వాతంత్ర పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ ఉధ్యమంలో రైతులతోపాటు సామాన్య ప్రజలు కలసి రావాలని కోరారు .ఈ దీక్షల్లోసీపీఎం నాయకులు జీ.వెంకటేశ్వర్లు,ఓ. రామకోటయ్య, గంజి.శ్రీను,దామా కృష్ణయ్య,దువ్వూరి.జాన్,జీ.మాదవ మూర్తి పి.భాస్కర్ రావు,మల్లిక, డి .రామమూర్తి, వెంకట్రావు,సీపీఐ నాయకులు పి.మాలకొండయ్య,సుదర్సి.రావమ్మ , పి.బాలకో టయ్య,ఆదినారాయణ,బాల బ్రహ్మ చారి తదితరులు పాల్గోన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *