పెద్దలను గౌరవిద్దాం వారిని ప్రేమతో ఆదరిద్దాం. కమిషనర్.

పెద్దలను గౌరవిద్దాం వారిని ప్రేమతో ఆదరిద్దాం. కమిషనర్.

01/10/20

 

కనిగిరి అక్టోబర్ 1 (న్యూస్ మేట్) : మన అనుకునే వారితో కాసేపు

మనసు విప్పి మాట్లాడితే అదే నిజమైన సంతోషం. ప్రేమతో మనం మాట్లాడే మాటలు వారికి ఆనందాన్నిస్తుంది ఒంటరితనాన్ని పోగొడుతుంది. వృద్ధాప్యం అంటే అనుభవాల సారాంశం. అని కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ డివి ఎస్ నారాయణ రావు అన్నారు.ఈ రోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్బంగా స్నేహహస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో వాసవి వృద్ధుల ఆశ్రమం సందర్శించి అక్కడ వున్న వృద్దులకు బ్రేడ్, ఆపిల్ పండ్లు పంపిణీ చేశారు.కమిషనర్ మాట్లాడుతూ ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం అబినందించదగిన విషయం ఈ వయసులో వారు నిరాశ్రయులు అయిన వీరికి బిడ్డలుగా మన వంతుగా వారికి తోచిన విదంగా సహాయపడాలి . వారిని ఆప్యాయంగా పిలిచే మాటలు వారికి మనం ఉన్నామన్న భరోసాను ఇస్తుంది అని అన్నారు. జీవితమంతా కష్టపడి అలసిపోయి ఉన్న వారిని ఈ వయసులో వారికి మనం చేదోడుగా ఉందాం. ఇలాంటి సదవకాశం కల్పించిన స్నేహహస్తం వారికి ధన్యవాదములు ఎన్ని ఒడి దుడుకులు పని హడావుడి వున్నా వారితో గడపడం ఆనందించదగిన విషయం నా వంతుగా మీకు యెల్ల వేళల అందుబాటులో వుంటాను నా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహహస్తం అధ్యక్షులు సభ్యులు సుధీర్ బాబు, భాస్కర్, మల్లికార్జున్, నారాయణ, బేబీ రాజు, నాగేంద్ర, దశరద్,ఆశ్రమం నిర్వాహకులు రంగనాయకులు,పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *