యువజన మాస పత్రిక ఆవిష్కరణ
ఒంగోలు అక్టోబర్ 1( న్యూస్ మేట్) : స్థానిక మల్లయ్య లింగం భవనంలో యువజన మాసపత్రికను సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్ ఎల్ నారాయణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి భవిష్యత్ తరాల్లో విద్యార్థి యువత ఉపయోగపడే విధంగా యోజన మాస పత్రిక ఉంటుందని ఆయన తెలిపారు. విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ యువత ఉపాధి గురించి అనేక విషయాలు యోజన మాస పత్రిక పొందుపరిచి ఉంటుందని ఆయన అన్నారు. యువ మాస పత్రిక గతంలో ఉండేదని కొన్ని కారణాల వల్ల అది నిలిచిపోవడంతో మరల తిరిగి దానిని పునరుద్ధరించడం గొప్ప విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు యోజన మాస పత్రిక ద్వారా ప్రజలకు అందచేయుట విలువైన సమాచారం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రావు .ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పురిని రవి ప్రధాన కార్యదర్శి ఎర్రంశెట్టి ఆనందమోహన్ ,జిల్లా కోశాధికారి ,నారాయణమ్మ ఏ ఐ వై ఎఫ్ మాజీ జిల్లా నాయకులు పురిని గోపి, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పురిని సాయి ,కందుకూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కలవకూరు హరిబాబు, బొజ్జ చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు