మనీషా వాల్మీకి పై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించిన అఖిల భారత యువజన సమాఖ్య.

మనీషా వాల్మీకి పై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించిన అఖిల భారత యువజన సమాఖ్య.01/10/20

ఒంగోలు అక్టోబర్ 1 (న్యూస్ మేట్) : ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి పై జరిగిన అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ , ప్రదర్శన జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర బాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటినుండి నేటి వరకు మహిళలపై దళితులపై ముస్లిం మైనార్టీ లపై వరుసగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి పై నలుగురు కలిసి అత్యాచారం చేసి ఆ సంఘటన బయటకు రాకుండా ఉండేందుకు మనీషా నాలుకను కోసి మెడలు వంచి అపస్మారక స్థితిలో వదిలి వెళ్లిపోవడం జరిగిందనిఈ ఘటనకు పూర్తిగా బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసి దోషులను ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలు కాపాడమంటూ హిందూ ధర్మం ప్రకారం మహిళలను అణిచి వేసే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చిన నాటి నుండి దళితులను శిరోముండనం చేస్తూ దళితులపై అనేక అరాచకాలను సృష్టిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి తీరును మార్చుకోకపోతే దేశం వ్యాపితంగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎప్ జిల్లా అధ్యక్షులు పురిని రవి. ప్రధాన కార్యదర్శి ఎర్రంశెట్టి ఆనందమోహన్, జిల్లా కోశాధికారి పి.వి. నారాయణమ్మ, కందుకూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కలవకూరీ హరిబాబు ,బొజ్జా చంద్రమోహన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పురిని సాయి, ఏ ఐ వై ఎఫ్ మాజీ జిల్లా నాయకులు పురీని గోపి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *