వాసవి సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా కేశవరావు.
ఒంగోలు ,అక్టోబర్ 2 (న్యూస్ మేట్) : ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా చక్కా వెంకటకేశవరావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఆ మేరకు శుక్రవారం ఒంగోలు ఆర్య వైశ్య భవన్ లో గాంధీ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సూర్య ప్రకాష్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ ఇప్పటివరకు వాసవి సేవాదళ్ కోశాధికారిగా ఎన్నో సేవలు అందించినట్లు తెలిపారు. ప్రధానంగా కరోనా సమయంలో గత ఆరు నెలల నుండి ప్రతిరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో బాధితులను ఆదుకోవడంలో ప్రధాన పాత్ర వహించినట్లు ఆయన తెలిపారు. కరోనా తొలిదశలో వలస కార్మికులకు ప్రతిరోజు భోజన వసతులు కల్పించినట్లు కేశవరావు తెలిపారు. ఇకముందు కూడా సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వహిస్తానని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులందరినీ కలుపుకొని సంఘం అభివృద్ధి తో పాటు సేవా కార్యక్రమాల్లో అందరి భాగస్వామ్యం ఉండేలా కృషి చేస్తానని కేశవ రావు అన్నారు. తనకు ప్రధాన కార్యదర్శి బాధ్యత అప్పగించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు