మనీషా దోషులను శిక్షించాలని ఏఐవైఎఫ్ కొవ్వొత్తుల ప్రదర్శన.

మనీషా దోషులను శిక్షించాలని ఏఐవైఎఫ్ కొవ్వొత్తుల ప్రదర్శన.

కందుకూరు అక్టోబర్ 2(న్యూస్ మేట్) : 02/10/20ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి పై జరిగిన అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కందుకూర్ లో అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఆనందమోహన్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటినుండి నేటి వరకు మహిళలపై దళితులపై ముస్లిం మైనార్టీ లపై వరుసగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి పై నలుగురు కలిసి అత్యాచారం చేసి ఆ సంఘటన బయటకు రాకుండా ఉండేందుకు మనీషా నాలుకను కోసి మెడలు వంచి అపస్మారక స్థితిలో వదిలి వెళ్లిపోవడం జరిగిందనిఈ ఘటనకు పూర్తిగా బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసి దోషులను ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలు కాపాడమంటూ హిందూ ధర్మం ప్రకారం మహిళలను అణిచి వేసే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి తీరును మార్చుకోకపోతే దేశం వ్యాపితంగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎప్ , కందుకూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కలవకూరీ హరిబాబు ,బొజ్జా చంద్రమోహన్, రమేష్ హుస్సేన్ అనిల్ బాలబ్రహ్మచారి సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *