వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో మెడకు ఉరి తాడు తో వినూత్నంగా నిరసన
కనిగిరి అక్టోబర్ 2 (న్యూస్ మేట్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సిపిఎం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మెడకు ఉరి తాడులు తగిలించుకొని వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గా కనిగిరి ప్రాంతీయ కమిటీ కార్యదర్శి పి కేశవరావు , ఏపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి తిప్పారెడ్డి లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లు రైతుల మెడకు ఉరి లాంటిదని దానివలన రైతులు నష్టపోవాల్సి వస్తుందని వారు అన్నారు .రైతులను కార్పొరేటర్ వ్యవస్థకు బానిసలను చేస్తుందని ఈ బిల్లు కారణంగా రైతు పంట ధర వినియోగదారులకు కార్పొరేట్ ఇష్టపూర్వకంగా చేస్తుందని అన్నారు .రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల నడ్డివిరిచి విద్యుత్ ఛార్జీల మోగించే విధంగా ఉచిత వ్యవసాయ విద్యుత్ కు మంగళం పాడేలా మోటార్లకు మీటర్లు బిగించేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నారు అని అన్నారు .కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుకు టిడిపి , వైసిపి మద్దతు తెలపటం దారుణమన్నారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాయమాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రైతుల కు నష్టం చేకూర్చే బిల్లును ఉపసంహరించుకునేలా ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పిలుపునిచ్చారు . వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతులకు అప్పగిస్తే ధరలు అధికంగా నిర్వహించటం వల్ల మధ్యతరగతి పేద ప్రజల కొనుగోలు శక్తి తగ్గి పేదరికం పెరిగి తద్వారా జిడిపి తగ్గి దేశ ఆర్థిక అభివృద్ధి దెబ్బతింటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆదినారాయణ, శ్రీ రాములు, వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు కొండారెడ్డి ,మై మూన్ ,వలి ,ఏడుకొండలు, చెన్నమ్మ, పిచ్చయ్య ,ఖాసీంవలి, ప్రసన్న ,రఫీ, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు