కేంద్ర తీసుకున్న మూడు బిల్లులు రైతులకు ఉరితాడు – సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ.

కేంద్ర తీసుకున్న మూడు బిల్లులు రైతులకు ఉరితాడు .
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ.
ఒంగోలు అక్టోబర్ 2( న్యూస్ మేట్స) : 02/108/20కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల తీసుకున్న మూడు బిల్లులు రైతులకు ఉరితాడుగా మారాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ అన్నారు మండలంలోని మారెళ్ళ గ్రామంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న సీపీఐ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసి రైతుల నడ్డి విరు స్తుందన్నారు. భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ పనుల పై ఆధారపడి జీవనం సాగిస్తు0టే వారికి రాయితీలు ఇవ్వడంలో మొండి వైఖరి అవలంభిస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తూ రైతాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట రావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు రైతుల పాలిట సమాదిగ మారిందన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ప్రైవేటీకరణ చట్టాలను రద్దు చేయాలని ఆయన కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కూలీలుగా మార్చే విధానాన్ని ఉపసంహరించు కోవాలని ఆయన అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంలో తీసుకు వచ్చిన నూతన చట్టాలను రద్దు చేయాలన్నారు ఈ బిల్లులు అమలైతే దేశంలోని రైతులతో పాటు సామాన్య పేద మధ్య తరగతి వాళ్ళందరికీ ప్రమాదకరమన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు బిల్లులు వలన పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ శక్తులకు వరంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుంకర అంజి రెడ్డి దర్శి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి వీరాంజనేయులు మండల సహాయ కార్యదర్శి షేక్ సైదా హసన్ మారెళ్ళ గ్రామ శాఖ కార్యదర్శి ఎర్రి బోయిన కోటయ్య కన్నా రెడ్డి సుంకర సుజాత తదితరులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *