మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి .జనసేన,

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి .జనసేన,

ఒంగోలు అక్టోబర్ 5 (న్యూస్ మేట్): 06/10/20కారంచేడు మండలం స్వర్ణ గ్రామం లో మైనర్ బాలికపై జరిగిన పైశాచిక అత్యాచారాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గం ఇంచార్జి కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ మైనర్ బాలికపై జరిగిన పైశాచిక అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మహిళలు బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు .బాధితురాలికి న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు. సంఘటనకు బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందించారు .ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు తిరుమల్ రెడ్డి చైతన్య రెడ్డి నాగార్జున రానా హరీష్ గోపి గోవర్ధన్ రవి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *