వైసీపీ తీర్థం పుచ్చుకున్న 20 కుటుంబాలు.
కందుకూరు అక్టోబర్ 5 (న్యూస్ మేట్) : స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణంలో మండల పరిధిలోని కొండి కందుకూరు పంచాయతీ లో గల దళిత కాలనీకి చెందిన 20 టీడీపీ కుటుంబాలు వైస్సార్సీపీ నాయకులు కుమ్మర బ్రహ్మయ్య ఆధ్వర్యంలో టిడిపినివీడి కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సమక్షంలో సోమవారం వై.సి.పి.లో చేరారు .ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ అభ్యర్థి గా పోటీచేసిన మెంటా నరసింగరావు కాలనీకి చెందిన వారికి శాసన సభ్యులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పట్ల ప్రజలు ఆకర్షితులై వైస్సార్సీపీ లో చేరుతున్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారి అందరికీ స్వాగతం పలుకుతూ ఏ సమస్య వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మండల పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి రు 2 కోట్ల రూపాయలు నిధులు కావాలని ప్రతిపాదన పంపాము. త్వరలో ఆ పథకం పనులు ప్రారంభమవుతాయన్నారు. రహదారి ఇబ్బందిగా ఉందన్న సమస్యను పార్టీలో చేరిన వారు వివరించగా స్పందించిన ఎమ్మెల్యే రహదారి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బక్క ముంతల కోటేశ్వరరావు ,రాజా తదితరులు పాల్గొన్నారు