యోగి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి.. రాజకీయ య ప్రజా సంఘాలు

యోగి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలి 05/10/20 రాజకీయ య ప్రజా సంఘాలు
కందుకూరు అక్టోబర్ 5 (న్యూస్ మేట్) :  ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత యువతి మనీషా అత్యాచారం, హత్య సంఘటనను సుప్రీం కోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం సాయంత్రం కందుకూరు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు కసుకుర్తి మాల్యాద్రి, సామాజిక వేత్త పాలేటి కోటేశ్వరరావు, సిపిఐ నాయకులు బూసి సురేష్, సిపియం నాయకులు జి వెంకటేశ్వర్లు,కుమార్, సిఐటియు నాయకులు గౌస్, బిటిఎ రాష్ట్ర నాయకులు షేక్ అబ్దుల్లా, డి. నరసింహం, సంఘా మహేంద్ర, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గడ్డం వెంకట్రావు, టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గోచిపాతల మోషే, ముస్లిం డెవలప్మెంట్ ఆర్గనైజషన్ అధ్యక్షులు సంధాని,అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు సూర్యనారాయణ, జాషువా సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ముప్పవరపు కిషోర్, ధమ్మ చక్ర ఫౌండేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు బి వెంకటేశ్వర్లులు ప్రసంగించారు. మోడీ, యోగి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సిపియం నాయకులు మువ్వా కొండయ్య, ఏఏడీ అధ్యక్షులు గేరా చిరంజీవి, కెవిపిఎస్ మాల్యాద్రి పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *