త్రాగు నీటి కై మహిళల నిరసన
పొదిలి అక్టోబర్ 5 (న్యూస్ మేట్) : పాలకుల నిర్లక్ష్యం త్రాగునీటికి ఇబ్బందికరంగా మారింది. పాలకులు మారుతున్నా త్రాగునీటి సమస్య తీరటం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. ప్రధానంగా నీటి సమస్య ఈనాడు ప్రతి ప్రాంతంలో జటిలంగా మారింది. అయితే పాలకులు తాత్కాలిక పథకాలతో పబ్బం గడుపుతున్నారు. శాశ్వత పథకాలపై దృష్టి పెట్టడం లేదు. పొదిలి పట్టణంలో త్రాగునీటి సమస్య రోజు రోజుకి తీవ్రంగా మారుతున్నది. పట్టణంలోని ప్రకాష్ నగర్ ఇస్లాం పేట లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా అందిస్తున్న నీరు సరిపోవటం లేదంటూ మహిళలు సుమారు వందమందికి పైగా సోమవారం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి తమ సమస్యను అధికారులకు విన్నవించారు.