మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ కదం తొక్కిన ప్రజా సంఘాలు
ఒంగోలు అక్టోబర్ 5 (న్యూస్ మేట్) : కారంచేడు మండలం స్వర్ణ గ్రామం లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల రజక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రజా సంఘాల కార్యకర్తలు భారీగా తరలి వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేశారు .ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా స్పందించడం లేదని విమర్శించారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని వారు అన్నారు.