సజ్జ కు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం – మండల వ్యవసాయ శాఖ అధికారి..

సజ్జ కు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం…
మండల వ్యవసాయ శాఖ అధికారి..

వలేటివారిపాలెం అక్టోబర్ 5 (న్యూస్ మేట్) : 05/10/20మండలడల పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ సహకారంతో సజ్జ పంటను కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మండల వ్యవసాయ శాఖ అధికారి హేమంత్ భరత్ కుమార్ తెలిపారు. సజ్జ పంటను ప్రభుత్వం క్వింటాకు 2150 రూపాయల కనీస మద్దతు ధరను ప్రకటించిందని అన్నారు. మండలంలోని సజ్జ పంట వేసిన రైతులు తమ గ్రామ పరిధిలోని వ్యవసాయ సహాయకులను కలిసి రైతు భరోసా కేంద్రాల వద్ద పంట వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. సజ్జ పంట వేసిన ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసుకోవాలని ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి ఎం.హేమంత్ భరత్ కుమార్ తెలిపారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *