వరకట్న వేధింపులు నిరసిస్తూ ఐద్వా నిరసన

వరకట్న వేధింపులు నిరసిస్తూ ఐద్వా నిరసన
కనిగిరి అక్టోబర్ 5 (న్యూస్ మెట్) :  05/10/20కనిగిరి పట్టణంలోని నాలుగో వార్డు కు చెందిన షేక్ షాఫిన్ అత్తింటి వరకట్నపు వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్ ఎదురుగా బైటాయిచింది. వివరాల్లోకి వెళితే కనిగిరి నాలుగో వార్డ్ కి చెందిన షేక్ షా ఫిన్ అనే మహిళకు అదే ప్రాంతానికి చెందిన షేక్ కాజా పిర కుమారుడు తో 2019 లో వివాహం జరిగింది. వివాహం తర్వాత ప్రైవేటు స్కూల్లో 8వేల జీతానికి పని చేస్తుంది. కొద్ది రోజుల క్రితం తన తండ్రి చనిపోవడంతో తల్లి బాధ్యత కూడా తానే చూసుకోవాల్సి వచ్చింది. నీ జీతం డబ్బులు నీ తల్లికి ఖర్చు పెట్టవద్దని తన అక్క బావ చెప్పిన విధంగా వినాలని ని తన భర్త అత్తమామలు తనను బెదిరించే వారు. ఏ ఆధారం లేని తన తల్లిని తను చూసుకోవాలని చెప్పగా నీవు కట్నంగా లక్షలు ఏమైనా తెచ్చావా 50వేల రూపాయలు ఒక ఉంగరం మాత్రమే తెచ్చావు మీ అమ్మ పేరు మీద ఉన్న ఇంటిని నీ పేరు మీదకి రాయించుకొని రావాలని లేకపోతే నీకు విడాకులు ఇస్తానని అత్త మామ భర్త మరియు బంధువులు తన ను రోజు చిత్రహింసలు పెట్టేవారని తెలిపింది. అత్త మామ భర్త బంధువులు తనపై తన తల్లిపై దాడి చేసి గాయపరచగా అత్త మామ బంధువులు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక అత్త మామ బంధువులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా. ఇప్పటివరకు వారిని అరెస్టు చేయలేదని ఆమె అన్నారు. వరకట్న వేధింపులకు గురి చేసిన భర్త అత్తమామలను అరెస్టు చేయకపోవడానికి నిరసనగా ఐద్వా ఆధ్వర్యంలో ఈరోజు బాధిత మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలియ జేసింది. ఎస్సై జి రామిరెడ్డి వారిని వెంటనే అరెస్టు చేసి న్యాయం చేస్తామని సర్దిచెప్పడంతో నిరసన విరమించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *