రైతుకు వెన్నుదన్ను వైయస్సార్ జలకళ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి
కందుకూరు అక్టోబర్ 5 (న్యూస్ మేట్) : వైయస్సార్ జలకళ సన్నకారు రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వైయస్సార్ జలకళ ప్రాధాన్యతను వెల్లడించారు. వైయస్సార్ జలకళ ప్రదాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన అద్భుతమైన పథకం వైయస్సార్ జల కళ అని ఆయన అన్నారు ఈ పథకం కింద రైతులకు . ఈ పథకం క్రింద బోర్ లు ప్రభుత్వం ఉచితంగా వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల బోర్లు వేయటం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. 2350 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు ఆయన చెప్పారు . ఈ పథకాన్ని వినియోగించుకొని రైతాంగం తమ పొలాలను సాగు చేసుకోవడం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని చెప్పారు.