అయ్యా ముఖ్యమంత్రి గారు గ్రామాలను అభివృధి చేయండి సారూ…

అయ్యా ముఖ్యమంత్రి గారు గ్రామాలను అభివృధి చేయండి సారూ…

* చినుకు పడితే ఇక్కట్లే
* జనసేన నాయకులు కనపర్తి మనోజ్

06/10/20కందుకూరు (పొన్నలూరు ) అక్టోబర్ 6 (న్యూస్ మేట్): 06/10/20రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని చెబుతున్న ముఖ్యమంత్రి గ్రామాలను పట్టించుకోవటం విడ్డూరంగా ఉందని కొండేపి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ అన్నారు. మంగళవారం పొన్నలూరు మండలం లోనీ చెరుకూరు గ్రామంలోనీ ఎస్సీ , ఎస్టీ, బిసి కాలనీలను ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కి గ్రామాలు కనిపించకుండా పోయాయని ఆయన అన్నారు. రాష్ట ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కొరకు 7846 కోట్ల నిధులు విడుదల చేసిందని ఆయన అన్నారు. సిమెంట్ రోడ్లు , మురుగు కాలువలు, కంకర రోడ్లు నిర్మాణానికి 2091 కోట్లు తో పనులు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు 12 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు నిండుగా ఉన్న గ్రామాల్లో మాత్రం అభివృద్ధి శున్యం గానే కనపడుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామాలలో రోడ్లు సరిగా లేకపోవడంతో వర్షాకాలం వచ్చినప్పుడు రోడ్లన్నీ బురదమయం కావడంతో ఆయా గ్రామస్తులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టిన మొదటి సంవత్సరం లోపు సిసి రోడ్లు వేసి గ్రామాలను అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చినా కొండేపి వైసీపీ ఇన్చార్జి మాదాసి వెంకయ్య చెరుకూరు గ్రామాన్ని అభివృద్ధి చేయలేదంటు ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. ఇంటింటికి కుళాయి వేయిస్తామని, సిసి రోడ్లు తోపాటు సైడ్ కాలవలు కూడా కల్పిస్తామని, అంగన్వాడీ భవనాలు కట్టిస్తామని, అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ లు ఇచ్చి వాటిపై దృష్టి సారించకపోవడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు .కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాజీవ్ కాలనీ అనీ, టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ కాలనీ అనీ, ఇప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో వైయస్సార్ కాలనీ అని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పేర్లు పెట్టుకుంటూ పేపర్ల కే పరిమితమవుతున్నాయి అని ఆయన ఎద్దేవ చేశారు. చెప్పిన హామీలు అమలు చేయకపోతే జనసేన చూస్తూ ఊరుకోదు అని ఆయన హెచ్చరించారు. ప్రజల సమస్యలు తెలుకుని వాటిని పరిష్కరించేందుకు జనసేన ఎప్పుడు ముందుంటుందని ఆయన అన్నారు.అధికారులు, నాయకులు మండలంలోని గ్రామాలను పర్యటించి వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. త్వరిత గతిన గ్రామాల్లో రోడ్లను నిర్మించి వానాకాలంలో ప్రజల ఇబ్బందులను తీర్చాలని ఆయను కోరారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *