జర్నలిస్టు పట్ల ప్రభుత్వ వైఖరి మారకపోతే రోడ్డెక్కి ఉద్యమిస్తాం

జర్నలిస్టు పట్ల ప్రభుత్వ వైఖరి మారకపోతే రోడ్డెక్కి ఉద్యమిస్తాం
ఒంగోలు అక్టోబర్ 6 (న్యూస్ మేట్) : 06/10/20సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు ఆరోపించారు. కరోనాతో రాష్ట్రంలో 38 మంది జర్నలిస్టులు మృతి చెందగా కనీసం సానుభూతి ప్రకటన కూడా ఈ ప్రభుత్వం చేయక పోవటం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తెలియజేస్తుందని ఆయన అన్నారు. ఆయన మంగళవారం న్యూస్ మేట్ ప్రతినిధితో మాట్లాడారు. కరోనా సమయంలో జర్నలిస్టులు ప్రభుత్వ కార్యకలాపాల కంటే ముందుగా ప్రజలకు అవసరమైన కరోనా సమాచారాన్ని ప్రతిరోజు ప్రాణాలకు తెగించి అందించారని అన్నారు. కరోనా సోకి పోషకాహారం తినటానికి శక్తి లేక జర్నలిస్టులుచనిపోతే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వక్రభాష్యం తో మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 10932 మంది ఆన్లైన్లో సంతకాలు చేశారని ఆయన తెలిపారు .ఆ ఫైలు తీసుకుని సమాచార శాఖ మంత్రి, సమాచార శాఖ కమిషనర్ దగ్గరకు వెళ్లే జర్నలిస్టుల సమస్యలు వివరించగా కనీసం స్పందించకపోవడం వారి విజ్ఞతను తెలియజేస్తుందని ఆయన చెప్పారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు ఒరిస్సా ప్రభుత్వం 15 లక్షలు పంజాబ్ 10 లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్ బాధిత కుటుంబాలకు అందించారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా సోకిన జర్నలిస్టులకు కనీసం 20 వేల రూపాయలు ఇవ్వటానికి కూడా ప్రభుత్వానికి ఆర్థిక స్తోమత లేక పోయిందని ఆయన వెల్లడించారు. ప్రతిరోజు సీఎం ని కలుస్తున్న సమాచార శాఖ కమిషనర్ జర్నలిస్టుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకుపోక పోవటం ఆయన నియంతృత్వాన్ని తెలియజేస్తుందని చెప్పారు. తెలంగాణలో కూడా కరోనా బాధితులకు ఆ ప్రభుత్వం 20 వేల రూపాయలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పత్రికా యాజమాన్యాలు కూడా కరోనాతో బాధపడుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు .కనీసం ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వని దుస్థితిలో పత్రిక యాజమాన్యం ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు. సిపిఐ రామకృష్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తున్నందున విశాలాంధ్ర దినపత్రికకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చేది లేదని సమాచార శాఖ కమిషనర్ చెప్పడం అంటే ఆయన ప్రభుత్వానికి ఎలా కొమ్ముకాస్తున్నారో అర్థమవుతుందని చెప్పారు. పత్రికలకి టీవీలకు యాడ్స్ ఇస్తున్న సమయంలో రెండు శాతం జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించాలనే ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని సుబ్బారావు వివరించారు. ఏపీయూడబ్ల్యూజే నడుపుతున్న ప్రతిస్పందన మంత్లీ మ్యాగజైన్ కి యాడ్ ఇవ్వటం లోనూ ప్రభుత్వం వివక్షత చూపుతున్న దని ఆయన తెలిపారు. సమాచార శాఖ కమిషనర్ జర్నలిస్టుల్లో రౌడీలు ఉన్నారని అనాలోచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని హితవు పలికారు. సెంట్రల్ నుంచి వచ్చిన ఆయనకి ఆంధ్రప్రదేశ్లోని జర్నలిస్టుల గురించి ఏమి తెలిసి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జర్నలిస్టు లేకుండా ఏ ప్రభుత్వ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళలేదన్న సత్యాన్ని కమిషనర్ గ్రహిస్తే ప్రభుత్వ పనితీరు మెరుగుపడుతుందని ఆయన తెలిపారు .జర్నలిస్టులు లేకుండా ప్రభుత్వం ఎలా నడుస్తుందో తాము చూస్తామని ఆయన అన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రభుత్వపరంగా రావాల్సిన రాయితీలు ఇవ్వని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ తీరు మార్చుకొని జర్నలిస్టులను గుర్తించకపోతే రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం అయ్యే అంతవరకు దీర్ఘకాలిక ఉద్యమాలు చేయటానికి ఏపీయూడబ్ల్యూజే ముందుంటుందని ఆయన తెలిపారు .భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అక్రిడిటేషన్ సమయం సెప్టెంబర్ 30తో ముగిసినా ఇంతవరకు రెన్యువల్ లేదా కొత్తవి ఇవ్వాలన్న ఆలోచన చేయకపోవటం దుర్మార్గమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులపై కక్షసాధింపు ధోరణి ఉన్న ప్రభుత్వాలు ఎంతో కాలం మనగలిగిన సందర్భాలు చాలా తక్కువ అని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మార్చి నెల తో ముగియగా రెన్యువల్ చేద్దామనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవటం జర్నలిస్టు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతుందని ఆయన చెప్పారు .ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్ట్ సంఘాలతో చర్చలు జరిపి జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *