త్రాగు నీటి సమస్య కై రోడ్డెక్కిన మహిళలు ఎమ్మెల్యే హామీతో ఆందోళన విరమణ
పొదిలి అక్టోబర్ 6 (న్యూస్ మేట్) : నీళ్ల సమస్య జఠిలంగా మారడంతో మహిళలు ఉద్యమ బాట పట్టారు. పొదిలి పట్టణంలో తరచూ నీటి సమస్య తలెత్తడంతో మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుమీద ఖాళీ బిందెలతో బైఠాయించారు, ఈ సందర్భంగా రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. అధికారులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా మహిళలు వినలేదు.తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని పట్టు పట్టారు.అయితే చివరకు అధికారులు సాధ్యమైనంత త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అక్కడి నుండి మహిళలంతా వెనుదిరిగారు .ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి ని మహిళలు కలిసి త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. అధికారులతో చర్చించి ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు