అంకమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి కమిటీ ఏర్పాటు

అంకమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి కమిటీ ఏర్పాటు06/10/20

కందుకూరు అక్టోబర్ 6 (న్యూస్ మెట్) :పట్టణంలోని గ్రామ దేవతలలో ఒకరైన అంకమ్మతల్లి దేవాలయం అభివృద్ధికి కమిటీ నీ కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్రెడ్డి మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం నడిబొడ్డున ఉన్న అంకమ్మ తల్లి దేవాలయం అభివృద్ధికి సుమారు కోటి యాభై లక్షలు రూపాయలు అవసరం అవుతుందని ఒక ప్రాథమిక అంచనా వేయడం జరిగిందని అందుకు దాతలు అనేకమంది ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రానున్న అంకమ్మ తల్లి తిరుణాలకు దాతల నుండి వచ్చిన విరాళాలను సక్రమంగా చూసుకునేందుకు కమిటీ బాధ్యులు గా పిడికిటి వెంకటేశ్వర్లు ,వెంకటరెడ్డి లను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. అంకమ్మ తల్లి దేవాలయం అభివృద్ధికి దేవాదాయ శాఖ అధికారుల సహాయంతో ముందడుగు వేయటం జరుగుతుందని అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంకమ్మ తల్లి దేవాలయం అభివృద్ధికి కుల మత చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సహాయసహకారాలు వస్తు రూపేనా ధన రూపేనా విరాళాలు అందించాలని ఆయన అన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *