పత్రికా రంగానికి వన్నెతెచ్చిన కావూరి

పత్రికా రంగానికి  వన్నెతెచ్చిన కావూరి

ఒంగోలు అక్టోబర్ 6 (న్యూస్ మేట్) : 06/10/20కావూరి వెంకట సుబ్బారావు పత్రికా రంగానికి కీర్తి ప్రతిష్ట తెచ్చారని పలువురు అన్నారు. కావూరి సంస్మరణ సభ ఒంగోలు రెడ్ క్రాస్ బిల్డింగ్ ఆవరణలోని ఓపెన్ ఆడిటోరియం లో ఒంగోలు సిటిజెన్ ఫోరమ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజానాట్యమండలి బాలకృష్ణ స్వాగతం పలుకగా ,ఫోరమ్ అధ్యక్షుడు కొల్లా మధు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు వక్తలు కావూరి సుబ్బారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు.జర్నలిస్టుగా ముప్పైయేళ్ళు నిజాయితీగా ప్రజాసమస్యలను వెలికితీసి ,వాటిసమస్యలపరిష్కారానికి కృషిచేసిన నిజాయితీగల వ్యక్తిని కోల్పోవడం బాధకలిగిస్తుందన్నారు.ముక్కుసూటి తనం,మంచితనం,ప్రజాసమస్యలపట్ల సంపూర్ణ అవగాహన కలిగిన కావూరి లాంటి వ్యక్తులు అరుదుగావుంటారన్నారు. ఎంతోమంది యువజర్నలిస్టులకు మార్గనిర్దేశకత్వాన్ని అందించిన స్ఫూర్తి ప్రధాత అని కొనియాడారు.సిపిఎం తో ఆయన అనుబంధం వెలకట్టలేనిదని,యువతను సమీకరించడం,తద్వారా సంఘబలోపేతానికి తీసుకోవలసిన మెళుకువలు చెప్పేవారని అన్నారు. సమాజాహితం కోరే మంచివ్యక్తిని కోల్పోవడం అత్యంతబాధాకరం అని అన్నారు.సుబ్బారావు ఆత్మీయులు మాదిగకార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరికనకారావు, మారెళ్ళ సుబ్బారావు,పావులూరి చిరంజీవి, బత్తుల ముసలారెడ్డి,చుండూరు రంగారావు,కోలా హరిబాబు,ఎస్.డి.సర్దార్,నార్నేవెంకటసుబ్బయ్య,డాక్టర్ వంశీకృష్ణ,డాక్టర్ కృష్ణారావు,డాక్టర్ నూకతోటి రవివికుమార్,మీసాల రామకృష్ణ, జర్నలిస్టు జిల్లానాయకులు కోనూరి శ్రీనివాసరావు,బ్రహ్మం,అశోక్,సూర్య బ్యూరో నాగేశ్వరరావు,అలుగుల సురేష్,పొన్నూరి శ్రీనివాసరావు,ప్రజాశక్తి మేనేజర్ ప్రసాద్,కావూరి వాసు,సుబ్బారావు తనయుడు నవీన్,సీపీఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు,దాయి నేని ధర్మ ముందుగా ప్రజాగాయకులు అంజయ్య,నూకతోటి శరత్ బాబులు కావూరిసుబ్బారావు పై స్మృతిగీతాలు అలపించారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *