ఈనెల 10న రాళ్లపాడు ఆయకట్టు రైతుల సమావేశం డిఇ లక్ష్మీనారాయణ
లింగసముద్రం అక్టోబర్ 6 (న్యూస్ మేట్) : ఈనెల 12 న ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తున్న సందర్భంగా ఈనెల పదో తారీఖున ఆయకట్టు రైతుల సమావేశం ఇన్స్పెక్షన్ బంగళావద్ద జరుగుతుందని డి.ఈ లక్ష్మీనారాయణ తెలియజేశారు. మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సమావేశంలో ఆయకట్టు రైతుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడం జరుగుతుందని డీ .ఈ తెలియజేశారు. ప్రస్తుతం సోమశిల నుంచి నీటి ప్రవాహం తగ్గిందని 20 క్యూసెక్కులు మాత్రమే నీరు వస్తుందని తెలియజేశారు . నీరు తక్కువగా వస్తున్నందున నీటిని పెంచాలని సోమశిల ప్రాజెక్టు అధికారులకు లేఖ రాశామని తెలియజేశారు. ఎడమ కాలువ వద్ద ఉన్న జంగిల్ ను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించాలని గతంలో ఎంపీడీవో కు లెటర్ రాశామని దానిని తొలగిస్తామని ఎంపీడీవో తెలియ చేశారని ఆయన చెప్పారు.