దళితులభూములకు వెళ్ళుదారి ని ఆక్రమించిన భూస్వాములు
గుడ్లూరు అక్టోబర్ 6( న్యూస్ మెట్) :
గుడ్లూరు మండలం రావూరు గ్రామం లో దళితులకు సంబంధించిన భూములకు వెళ్ళుదారి ని కొందరు భూస్వాములు ఆక్రమించారు. సర్వే నెంబరు 642 లో 100 లింకులు గల దారిని కనీసం 30 లింకులు కూడా లేని దారిగా కొందరు ఆక్రమణకు గురి చేశారు. దీనివలన ఆ దారిన వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు పరిశీలించి దారిని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.