వైయస్సార్ జలకళ పై అవగాహన

వైయస్సార్ జలకళ పై అవగాహన07/10/20

వలేటివారిపాలెం అక్టోబరు 8 (న్యూస్ మేట్) : గ్రామీణ ప్రాంతాలలో వైఎస్ఆర్ జలకళ కార్యక్రమంపై లబ్ధిదారుల ఎంపిక పై సంబంధిత అధికారులతో అవగాహన కార్యక్రమం ఎంపీడీవో రఫిక్ అహ్మద్ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విఆర్వోలు,డిజిటల్ అసిస్టెంట్లు,కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం అమలు విధానం అర్హుల ఎంపిక ఇతరత్రా సదుపాయాలపై సూచనలు చేశారు.ముఖ్యంగా ఈ పథకానికి రైతులు 2.5 ఎకరాల కనీసం భూమి కలిగి ఉండాలని చిన్న సన్నకారు రైతులు కొంతమంది కలిసినా ఈ పథకానికి అర్హులేనని ఆయన అన్నారు. పథకం అమలు ఎంపికపై సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సమీర్ భాష, సీనియర్ అసిస్టెంట్ శేషుబాబు, వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్లు,కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *