గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి
ఉలవపాడు అక్టోబర్ 7 న్యూస్ మేట్ : ఉలవపాడు మండల పరిధిలో చాగొళ్లు దగ్గర రోడ్డు మీద వెళ్తున్న యాచకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో యాచకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం , తెలుసుకున్న హైవే మొబైల్ పోలీసులు బ్రహ్మయ్య మరియు హరికృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఉలవపాడు ఎస్ఐ దేవ కుమార్ కు సమాచారం అందించగా ఎస్ఐ సూచనల మేరకు మృతదేహాన్ని ఉలవపాడు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.