జగనన్న విద్యా కానుక ప్రారంభించిన మంత్రి బాలినేని

జగనన్న విద్యా కానుక ప్రారంభించిన మంత్రి బాలినేని07/10/20
ఒంగోలు అక్టోబర్ 8 (న్యూస్ మేట్) : జిల్లా వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక పథకం పండగలా జరిగింది. జిల్లాలోని అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు జగనన్న విద్యా కానుక పథకాన్ని విద్యార్థులకు అందించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువు చదువుకోవాలని తద్వారా సమాజంలో వాళ్లు కూడా గౌరవప్రదంగా జీవించేలా చదువు ప్రతి విద్యార్థిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర విద్యుత్, అటవి శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఒంగోలులో జరిగిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ప్రజా ప్రయోజనాలు తనకు ముఖ్యమంటూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు .ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిమాట్లాడుతూ రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మన ముఖ్యమంత్రి సరికొత్త రికార్డు నెలకొల్పుతున్నారు అని అన్నారు .రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా తాను ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి ఎక్కడ రాజీ పడటం లేదని అన్నారు. దేశంలోనే అభివృద్ధిలో ఆంధ్ర ప్రదేశ్ కి గుర్తింపు తీసుకువచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోందని ఆయన అన్నారు. జగనన్న విద్యా కానుక విద్యార్థిని భావిభారత పౌరులుగా ఎదగటానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక అన్ని వర్గాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని అన్నారు .ప్రభుత్వ పథకాలు సక్రమంగా సద్వినియోగం చేసుకున్నపుడు ఏ ప్రాంత అభివృద్ధి అయినా జరుగుతుందని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో జగనన్న విద్యా కానుక సక్రమంగా అమలు జరిపేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కంకణబుద్ధుడు కావాలని ఆయన కోరారు. విద్యార్థి భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత ఆ పాఠశాల ఉపాధ్యాయుడు దేనని ఆయన చెప్పారు. జగనన్న విద్యా కానుక తో విద్యారంగంలో సరికొత్త మార్పు కి నాంది కానుందని భాస్కర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *