నల్లూరి సతీమణి సీతమ్మ మృతి

నల్లూరి సతీమణి సీతమ్మ మృతి
ఒంగోలు అక్టోబర్ 8 (న్యూస్ మేట్) : 08/10/20సిపిఐ సీనియర్ నాయకులు ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న)సతీమణి సీతమ్మ(84) గురువారం మృతి చెందారు .నల్లూరి కి జీవిత భాగస్వామి మాత్రమే కాక ఆమె అనేకమంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు కళాకారులకు అన్నపూర్ణగా సేవలందించింది .ఆమె మృతి పార్టీకి ప్రజా ఉద్యమానికి తీరనిలోటని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. ఆయన గురువారం ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి అనేకమంది ప్రముఖులు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం ఎల్ నారాయణ సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కొండేపి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి వీరారెడ్డి మార్కాపురం నియోజకవర్గ సిపిఐ సీనియర్ నాయకులు అందే నాసరయ్య తదితరులు నివాళులు అర్పించారు,

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *