తెట్టు లోఅదనపు ట్రాన్స్ ఫార్మర్ నిర్మాణం.

తెట్టు లోఅదనపు ట్రాన్స్ ఫార్మర్ నిర్మాణం.

గుడ్లూరు అక్టోబర్ 8 (న్యూస్ మేట్): గుడ్లూరు మండల పరిధిలో తెట్టు సబ్ స్టేషన్ లో 33/11 కెవి తెట్టు సబ్ స్టేషన్ నందు అదనపు 5 ఎంవిఏ ట్రాన్స్ ఫార్మర్ మరియు ఎల్.వి బ్రేకర్ ను సుమారు 60 లక్షల వ్యయంతో నిర్మించినట్టు విద్యుత్ శాఖ అధికారి ఎస్.కె.రఫీ తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ డి.ఈ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పగటిపూట అగ్రికల్చర్ కు 9 గంటల నిరంతర విద్యుత్ లో బాగముగా ఈ అదనపు ట్రాన్సఫార్మర్ నిర్మారం చెపట్టడం జరిగినదన్నారు. రానున్న సీజన్లో రైతులకు విద్యుత్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అదనపు ట్రాన్స్ఫారం నిర్మాణం చేపట్టినట్టు ఆయన తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అదనపు ట్రాన్స్ఫార్మర్స్ ను డివిజనల్ ఇంజనీర్ కట్టా వెంకటేశ్వర్లు ఛార్జ్ చేసి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో కన్ స్ట్రక్టన్ ఈ.ఈ. వెంకటేశ్వరరావు, ఏ.డి.ఈ వీరయ్య, కన్ స్ట్రక్షన్ ఏ.డి.ఈ అంజిరెడ్డి, సబ్ ఇంజినీర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *