“మనీషా “ను అత్యాచారం చేసి దారుణంగా చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
వెలిగండ్ల అక్టోబర్ 8 (న్యూస్ మేట్) : ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో 19 ఏళ్ల దళిత బాలికకు జరిగిన అమానుష మారణకాండకు నిరసనగా గురువారం వెలిగండ్ల లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు వెలిగండ్ల సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది .అనంతరం అంబేద్కర్ సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం నాయకుడు రాయల మాలకొండయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతు చట్టసవరణ తెచ్చిన సందర్భముగా వాటి గురించి ప్రజల దృష్టిలో పడనీయకుండా మీడియాను గొంతు నొక్కి మనీషా అనే దళిత అమ్మాయిమీద అహంకార మానభంగం చేసి చంపి కూడా శవాన్ని తల్లిదండ్రులకు అప్ప చెప్పకుండా అర్ధరాత్రి దహనం చేశారని హత్య చేసిన హంతకులను శిక్షించాలి ఉరి తీసి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వారన్నారు .అలాగే ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తగరం ఏసు మాదిగ మాట్లాడుతూ మనీషా లాంటి సంఘటనలు దళితుల మీద భారత దేశంలో రోజుకు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దళితులందరూ ఏకతాటిపై నిలబడాలి అన్నారు .మండల టిడిపి ఎస్సీసెల్ అధ్యక్షులు సాల్మన్ రాజు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద హంతకులను శిక్షించాలి జిల్లాలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిషన్ ఏర్పాటు చేసి నెలకు ఒకసారి దళిత గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి భయభ్రాంతులను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తాతపూడి సురేష్, తాతపూడి నాని, జె పి రాజు, గూడూరి వినోద్ కుమార్,జుటికె దానియేలు,జుటికె రామయ్య,రాజు, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు తగరం జాన్, కుమ్మర కుంట ఇజ్రాయెల్, మల్లెల అంకయ్య, గూడూరి మధు,అణమలగుర్తి డేవిడ్,తదితరులు పాల్గొన్నారు