విద్యకు మెరుగులు భవితకు బాటలు పథకాల అమలే సీఎందేయం.ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్.

విద్యకు మెరుగులు భవితకు బాటలు పథకాల అమలే సీఎందేయం.ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్.

కనిగిరి అక్టోబర్ 8 (న్యూస్ మేట్)   : 08/10/20ప్రతి విద్యార్థి చదువుకోవడానికి పేదరికం అడ్డురాకుడదని వారు బాగా చదుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి జగనన్న విద్యా కానుక ప్రవేశపెట్టారని కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని గురువారం కనిగిరి లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థలో ఇప్పటి వరకూ పన్నెండు నుంచి పదమూడు వేల కోట్ల రూపాయలు వరకు జగన్ అమ్మ ఒడి, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద జగనన్న విద్య దీవెన వంటి బృహత్తర పథకాలు విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టారని ఆయన అన్నారు .విద్యా కానుక ద్వారా స్టూడెంట్ కిట్లు పంపిణి అనేది దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు, తన పిల్లలు ఎటువంటి పాఠశాలలో చదువుకున్నారో అటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించాలనే తలంపుతో ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. నాడు నేడు కార్యక్రమం లో భాగంగా ఎంపిక చేయబడిన పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా తీర్చిదిద్దడం జరుగుతుంది పాఠశాల మధ్యలో మానేసిన పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువు లేక ఆర్థిక ఇబ్బందుల పడుతున్న పిల్లలు నేడు ప్రభుత్వ పాఠశాలలో చేరటానికి ఆసక్తి చూపిస్తున్నారు గతంలో విద్యార్థులు లేక మూసివేయబడిన పాఠశాలలు కూడా తెరిచి మళ్లీ విద్యను ప్రారంభించడం జరుగుతుంది పోటీ ప్రపంచంలో లో నెగ్గుకు రావాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడానికి సీఎం పోరాడుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు అడ్డుతగులుతూ ఉండడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. .రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఆ ప్రభావం విద్యా వ్యవస్థ మీద పడకూడదని విద్యాలయాలను దేవాలయాలు గా మార్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిదేనని తెలియజేశారు. మనం ప్రతి ఒక్కరం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉన్నాము అన్నారు…. ఈ కార్యక్రమంలో మండల ఎంపిడిఓ విజయప్రసాద్ ఎంపీడీవో మల్లికార్జునరావు కమిషనర్ నారాయణరావు ఏఎంసీ చైర్మన్ సరితా రెడ్డి వైసిపి నాయకులు అబ్దుల్ గఫార్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత నాయకులు పెరుగు మురళి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *