న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతాం దళిత హక్కుల నాయకుడు

న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతాం దళిత హక్కుల నాయకుడు08/10/20

కనిగిరి అక్టోబర్ 8 (న్యూస్ మెట్) : కనిగిరి లో దళిత హక్కుల కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ దళిత హక్కుల అధ్యక్షుడు గోన దానయ్య మాట్లాడుతూ కనిగిరి మండలం నందన మారెళ్ళ జాతీయ రహదారి 565 వద్ద గత నెల 21వ తేదీన వాహనంపై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొన్న సంఘటన లో చిరు గురి కొండయ్య మృతి చెందడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేసి నేటికి 18 రోజులు కావస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి సాధించకపోవడం విచారకరం దళిత బిడ్డకు జరిగిన అన్యాయానికి పోలీసు వారునిమ్మకు నీరెత్తినట్టు ఉండడం బాధాకరం పోలీసు వారు వెంటనే స్పందించి నిందితున్ని పట్టుకొని చట్టపరంగా శిక్షించి దళిత బిడ్డలకు న్యాయం చేయాలని దళిత హక్కుల వేదిక నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో దళిత ఐక్యత ఉద్యమానికి వెనుకాడబోమని దళిత హక్కుల వేదిక కనిగిరి నియోజక వర్గ అధ్యక్షులు గోన దానయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాధితులు దళిత నాయకులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *