జగనన్న విద్యా కానుక పేద విద్యార్థులకు వరం – ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.

జగనన్న విద్యా కానుక పేద విద్యార్థులకు వరం.
ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.

వలేటివారిపాలెం అక్టోబర్ 8( న్యూస్ మేట్) : 08/10/20జగనన్న విద్య కానుక పేద విద్యార్థులకు ఒక వరమని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని పోకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. తల్లి గర్భం నుంచి బిడ్డ ఉన్నత చదువుల వరకు విద్య సమగ్ర పోషక ఆహారం అందించేందుకు వైఎస్సార్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. జగనన్న విద్యా కానుక,అమ్మ ఒడి, రైతు పెట్టుబడి రుణం, సున్నా వడ్డీ రుణాలను డ్వాక్రా గ్రూపు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలలో 95 శాతం అమలు చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా వైఎస్సార్ ప్రభుత్వం నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో వెంకటేశ్వరరావు, ఎంఈవో రవిచంద్ర, ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ పద్మజ, స్కూల్ చైర్మన్ గద్దె శ్రీనివాసరావు, వైసీపీ నాయకుడు అత్తోటి చెన్నయ్య, వడ్లమూడి వెంకటేశ్వర్లు, రాంబాబు, రంగారావు, అనుమొలు వెంకటేశ్వర్లు, కట్టా హనుమంతరావు, నరసయ్య, వీరస్వామి, వీరయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్కూలు సీసీ కెమెరాలకు గ్రామస్తులు 50 వేల రూపాయల నగదును ఎమ్మెల్యే సమక్షంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కి అందజేశారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *