అక్రమంగా ఇసుక తరలిస్తే కటకటాలే ఎస్సై సురేష్.
పొదిలి అక్టోబర్ 8 (న్యూస్ మెట్) : అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పొదిలి ఎస్ఐ సురేష్ హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా కి పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించే సమస్యే లేదని ఆయన తెలిపారు. గురువారం కాటూరి వారి పాలెం దగ్గర అక్రమంగా తరలిస్తున్న 61 టన్నుల ఇసుక 2 టిప్పర్ లు 2 ట్రాక్టర్లు డోజర్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా దర్శి రోడ్ లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఒకరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తెలిపారు