ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన మరో అత్యాచార ఘటన
కనిగిరి అక్టోబర్ 9 (న్యూస్ మేట్) : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మన్నేపల్లి మేరీ (20) అనే దివ్యాంగురాలుని ఆర్థికంగా శారీరకంగా వాడుకొని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కనిగిరి మండలం మాచవరం మామా నికి చెందిన మన్నేపల్లి మేరీ అనే దివ్యాంగురాలు గుంటూరు జిల్లా నరసరావుపేట లో(2015) ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రతి నెల వికలాంగుల పెన్షన్ తీసుకోవడానికి కనిగిరి కి వచ్చి మళ్లీ కాలేజీకి వెళ్లే సమయంలో విజయవాడ వెళ్లే కనిగిరి డిపోకు చెందిన బస్సు ఎక్కిన సమయంలో ఆర్టీసీ డ్రైవర్ అయిన దేవరకొండ కోటేశ్వరరావు తనతో మాటలు కలిపి నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తనకు చాలా పలుకుబడి ఉందని చెప్పి తన వద్ద ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ తనకు ఫోన్ చేసి మాట్లాడే వాడిని .ఒకసారి తనకు ఫోన్ చేసి విజయవాడ లో ఉద్యోగం ఉందని సర్టిఫికెట్ లతో రావాలని చెప్పి తనను విజయవాడ కి తీసుకుని వెళ్లి బస్సు డిపోలో రాత్రిపూట నిలిపి తనపై అత్యాచారం చేసి ఈ విషయం మీ ఇంట్లో ఎవరికీ చెప్పవద్దని నీకు ఇంటర్ పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత వచ్చి మీవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అలా పలుమార్లు తనను శారీరకంగా అనుభవించాడని తెలిపింది. ఒకసారి తన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా ఒక స్త్రీ ఫోన్ తీసి నీవు ఎవరు మా ఆయనకు ఫోన్ చేసావ్ అని నన్ను తిట్టింది. తర్వాత విషయం చెప్పగా తను కోటేశ్వరరావు భార్య అని చెప్పి తన భర్త పెద్ద తిరుగుబోతు అని అనేక మంది మహిళలతో తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పింది. ఈ విషయమై కోటేశ్వరరావు కు ఫోన్ చేసి వికలాంగురాలు అయిన తనను ఎందుకు మోసం చేశావని అడగగా ఫోన్లో దుర్భాషలు ఆడేవాడు. తన స్నేహితులైన కొందరికి తన ఫోన్ నెంబర్లు ఇచ్చి అసభ్యకరంగా మాట్లాడించే వాడని తెలియజేసింది. తాను బెంగళూరులో కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నానన్న విషయం తెలుసుకొని కొద్ది రోజులుగా మళ్లీ ఫోన్లు చేసి డబ్బులు అడిగే వాడు . ఈనెల వికలాంగుల పింఛన్ తీసుకోవడానికి వచ్చిన విషయం తెలుసుకొని తన ఇంటికి వచ్చి తన గురించి ఇంట్లోవారికి చుట్టుపక్కల వారికి చెడుగా చెప్పి తనతో గొడవకు దిగాడు. చుట్టుపక్కల వారు సర్దిచెప్పి కోటేశ్వరరావు ని పంపించి వేశారు. ఈ విషయమై తనకు జరిగిన అన్యాయం మరియు అత్యాచారం గురించి కనిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. కోటేశ్వర రావు లాంటి కామాంధుల నుంచి తనను తనలాంటి మహిళలను కాపాడి కోటేశ్వరరావును కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది.