యస్.సి.యస్.టి భూములను ఆన్లైన్ చేసి ప్రభుత్వ పథకాలు అందించాలి సిపిఐ.
కనిగిరి అక్టోబర్ 9 (న్యూస్ మేట్) : ప్రభుత్వం పేదలకు ఇచ్చిన యస్.సి,యస్.టి భూములను ఆన్లైన్ చేయాలని సిపిఐ మండల కార్యదర్శి జి.పి.రామారావు అన్నారు. శుక్రవారం కనిగిరి ఇన్చార్జి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగుచేసుకొంటున్న యస్.సి యస్.టి భూములను ఆన్లైన్ చేసిన యెడల ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా , జలకళ రాయితీ విత్తనాలు పీఎం కిసాన్ యోజన పంట బీమా వైఎస్సార్ రైతు భరోసా వంటి సంక్షేమ పధకాలు పొందటానికి అవకాశాలు ఉన్నాయని జీవనోపాధికి భరోసా ఉంటుందని. ఆక్రమణకు గురికాకుండా ఉంటుందని అన్నారు. ఈకార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు పుట్టాసుబ్బారావు, రాపూరిఅంజయ్య, లక్ష్మీమ్మ తదితరులు ఉన్నారు.