సీతమ్మ సేవలు మరువలేనివి
యర్రగొండపాలెం అక్టోబర్ 9 (న్యూస్ మేట్) : ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు సతీమణి సీతమ్మ సేవలు మరువలేనివని యర్రగొండపాలెం నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్, సీపీఐ సీనియర్ నాయకులు టి సి హెచ్ చెన్నయ్య లు అన్నారు. శుక్రవారం యర్రగొండపాలెం లోని సీపీఐ కార్యాలయంలో సీతమ్మ సంతాప సభ నిర్వహించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజానాట్యమండలి కళాకారులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు తన నివాసానికి వచ్చినప్పటికీ విసుగు పడకుండా భోజన వసతులు కల్పించి తన సొంత బిడ్డలాగా విచారించి ఆయా సంఘాలకు ప్రోత్సాహం కల్పించిన చరిత్ర ఉందన్నారు. వందేమాతరం శ్రీనివాస్, చంద్ర నాయక్ తదితరులను తన కుమారులతో సమానంగా పెంచిన ఆదర్శమూర్తిగా నల్లూరి వెంకటేశ్వర్లు ఎదుగుదలకు ఒక గృహిణిగా తన ధర్మాన్ని నిర్వర్తించి కమ్యూనిస్టు పార్టీ, ప్రజా నాట్య మండలి ఉద్యమాలకు పరోక్షంగా సహకరించిన ఆదర్శ మహిళ అని నిరూపించుకున్నారన్నారు. ఆమె మరణించిన అప్పటికీ ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ కృష్ణ గౌడ్, సీపీఐ దోర్నాల మండల కార్యదర్శి పూర్ణ కంటి తిరుమలయ్య, సీపీఐ యర్రగొండపాలెం మండల కార్యదర్శి కె. గురవయ్య, మరియు పార్టీ సభ్యులు సానుభూతి పరులు పాల్గొన్నారు.