సముద్రతీర ప్రాంతంలో రెండు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం ఒకరి పై కేసు నమోదు
గుడ్లూరు అక్టోబర్ 9 (న్యూస్ మేట్) : అనుమతి పత్రాలు లేకుండా కావలి కందుకూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన మండలంలోని సముద్ర తీర ప్రాంతమైన మొండి వారి పాలెం లో చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొండి వారి పాలెం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి సముద్రపు ఇసుకను డంప్ చేసి అనంతరం ట్రాక్టర్లకు లోడు చేయించి ట్రాక్టర్ ని 500 రూపాయల చొప్పున దళారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు గ్రామస్తులు కొందరి ద్వారా పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు మాటువేసి అక్రమంగా సరఫరా అవుతున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ట్రాక్టర్ల నిర్వాహకులు హరిబాబు పోలయ్య లను అదుపులోకి తీసుకొని అక్రమ ఇసుక రవాణాకు ప్రధాన కారకుడైన సుధాకర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుడ్లూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మురళీధర్ రావు శుక్రవారం తెలిపారు.