ట్రావెల్ బస్సు బోల్తా ప్రయాణికులు క్షేమం

ట్రావెల్ బస్సు బోల్తా ప్రయాణికులు క్షేమం
పామూరు అక్టోబర్ 9 (న్యూస్ మేట్) :  09/10/20ట్రావెల్ బస్ అదుపుతప్పి బోల్తా పడ్డ ఘటన 565 జాతీయ రహదారిపై మండలంలోని తిరగలదిన్నె గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన పంచముఖి ట్రావెల్ బస్ విజయవాడ నుండి ప్రొద్దుటూరుకు 10 మంది ప్యాసింజర్స్ , డ్రైవర్, క్లీనర్ తో పోతోంది. ఈ సందర్భంలో 565 జాతీయ రహదారిపై తిరగలదిన్నె గ్రామ సమీపంలో బస్ అదుపుతప్పి పక్కనే గల పొలాల్లోకి బోల్తా కొట్టింది . ఘటనలో బస్ స్వల్పంగా దిబ్బతినగా అదృష్టవశాత్తు ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాలేదు . కాగా ప్రయాణీకులను ట్రావెల్స్ డ్రైవర్ పుల్లయ్య మరోబస్ లో ప్రొద్దుటూరుకు పంపినట్లు తెలిపాడు . బస్ బోల్తా కొట్టడంతో బస్లోని స్టేషనరీ , ఉడ్ ఫర్నీచర్ , ఫ్యాన్సీ ఐటమ్స్ తో కూడిన పార్సిల్స్ పొలంలో కిందపడగా క్రేన్ సాయంతో బస్ ను రోడ్డుపైకి చేర్చారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *