300 టన్నుల ఇసుకను మనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
పామూరు అక్టోబర్ 9 (న్యూస్ మేట్) : పామూరు మండలంలోని లక్ష్మి నరసాపురం నుండి పుట్టనాయుడుపల్లి గ్రామం వెళ్లే దారిలో నూతనంగా నిర్మిస్తున్న ఎం కల్వర్టు దగ్గర నిల్వ ఉంచిన 300 టన్నుల ఇసుకను శుక్రవారం కనిగిరి స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సెబ్ ఇన్స్పెక్టర్ అర్. విజయ భాస్కర్ రావు మరియు ఎస్ఐ. అంబటి చంద్రశేఖర్ లు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మండలంలోని లక్ష్మి నరసాపురం నుండి పుట్టనాయుడుపల్లి గ్రామం వెళ్లే దారిలో ఇసుక నిల్వ చేసిన ప్రాంతాన్ని పరిశీలించి 300 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. రోడ్లు మరియు కల్వర్టు లను నిర్మాణం కోసం ఉంచినట్లు సైట్ ఇంజనీర్ కొత్త. వెంకట ప్రసాద్ తెలిపారు. ఇసుక నిల్వ ఉంచిన సైట్ ఇంజనీర్, గుత్తేదారు మరియు భూ యజమాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు