పూర్వ విద్యార్థి సొంత ఖర్చుతో స్కూల్ లో పారిశుద్ధ్య చర్యలు.
వలేటివారిపాలెం అక్టోబర్ 9 (న్యూస్ మేట్) : మండలంలోని వలేటివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కే.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ పూర్వ విద్యార్థి వలేటి బ్రహ్మయ్య తన సొంత నిధులతో పాఠశాల మొత్తం శుక్రవారం శానిటైజేషన్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని,భౌతిక దూరం పాటించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు శానిటైజేషన్ ఉపయోగించాలని అన్నారు. అలాగే పూర్వ విద్యార్థి తన సొంత ఖర్చులతో పాఠశాల మొత్తం శానిటైజేషన్ చేయించి ఆటస్థలం మొత్తం పిచ్చి మొక్కలకు మందు పిచికారి చేయించిన ఓలేటి బ్రహ్మయ్య ను ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు మరియు పిల్లల తల్లిదండ్రులు అభినందించారు.