అమరావతి ఆంధ్రుల రాజధాని మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

12/10/20కనిగిరి అక్టోబర్ 12(న్యూస్ మెట్) :
ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిని కదిలించాలి అని చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హెచ్చరించారు. అమరావతి రైతుల దీక్షలు 300 రోజులకు చేరిన సందర్భంగా కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిరైతుల 300 రోజుల ఉద్యమానికి మద్దతుగా ప్రజా ఉద్యమం చేపడుతున్నట్టు చెప్పారు. ఆయన స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఆంధ్రుల రాజధాని సమరభేరి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని అమరావతి రైతుల త్యాగానికి అన్యాయం చేయవద్దని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఒకే రాజధాని అమరావతి కావాలని కోరుకుంటున్నారని అమరావతి రైతుల దీక్షకు మద్దతు తెలుపుతూ వారి పోరాటానికి చివరిదాక అండగా ఉంటామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో వివిఆర్ మనోహర్ రావు, బేరి పుల్లారెడ్డి, షేక్ బుజ్జా, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి,జంషీర్ అహ్మద్, తమ్మనేని శ్రీనివాసులు రెడ్డి, తమ్మనేని వెంకటరెడ్డి, సైకం మలకొండారెడ్డి, యం చెంచిరెడ్డి, బ్రహ్మం గౌడ్, ఎస్టిఆర్ చిన రామిరెడ్డి, గాయం రామిరెడ్డి, ఫిరోజ్, యువరాజ్, వేంపాటి మధు, రజాక్, శ్రీరాములు, శ్రీనివాసరావు, కొండలు, సురేంద్ర, కే శ్రీను, బాలు,షడ్రఖ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *