అమరావతి రైతుల 300 రోజుల దీక్షకు మద్దతుగా దీపాలు వెలిగించిన కనిగిరి టిడిపి ఇన్చార్జి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి

అమరావతి రైతుల 300 రోజుల దీక్షకు మద్దతుగా దీపాలు వెలిగించిన కనిగిరి టిడిపి ఇన్చార్జి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి అక్టోబర్ 11 (న్యూస్ మేట్):12/10/20అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు 300 రోజుల సందర్భంగా అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతూ కనిగిరిలో ఇన్చార్జ్ Dr ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అని నినాదంతో ప్లకార్డ్స్ తో నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం మొండివైఖరి మార్చుకోవాలని అన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 300 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వంలో మార్పు రాకపోవడం గర్హనీయమన్నారు. మూడు రాజధానులు అనే అంశాన్ని విరమించుకొని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ప్రకటించాలి అంటూ పెద్ద ఎత్తున జై అమరావతి జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆంధ్రుల రాజధాని – సమరభేరి నిరసన కార్యక్రమాలకు మద్దతుగా స్కై లాంతర్లు ద్వారా నిరసన దీపాలు వెలిగించి అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *