చోరీ కేసులో నిందితులు అరెస్ట్ రు 7.60 లక్షలు సొత్తు స్వాధీనం
గుడ్లూరు అక్టోబర్ 12 (న్యూస్ మేట్) :గుడ్లూరు మండల పరిధిలో నలుగురు చిల్లర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి రు 7లక్షల 60వేలు స్వాధీనం చేసుకున్నట్లు కందుకూర్ డి.ఎస్.పి కె శ్రీనివాసరావు తెలిపారు. గుడ్లూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూ గత కొద్దికాలంగా ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఘటనలు పెరిగాయి అన్నారు. ఈ నేపథ్యంలో సిసిఎస్ బృందాలను ప్రత్యేకంగా రంగంలోకి దించి నిందితుల కోసం వేటను ప్రారంభించామని అన్నారు. విశ్వసనీయంగా అందించిన సమాచారం మేరకు గుడ్లూరు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మల్లికార్జున రావు సిబ్బందితో గుడ్లూరు మండలం లోని చెమిడిదపాడు అడ్డరోడ్డు వద్ద ఒంగోలు పట్టణానికి చెందిన అల్లూరయ్యను అరెస్టు చేశారని డీఎస్పీ వెల్లడించారు. అతని వద్ద ఉన్న బంగారు బుట్ట కమ్మలు సాధారణ కమ్మలు వెంకటేశ్వర స్వామి ఉంగరం ముక్కుపుడక వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామానికి చెందిన షేక్ మీరా మొహిద్దీన్ తో పాటు సయ్యద్ సుభాని లను తెట్టు క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేసినట్లు వారి వద్ద నుండి 12 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు వీరు ఎవరు లేని సమయంలో ఇళ్ల వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం వీరి నైజం అని పేర్కొన్నారు.కందుకూరు కోర్టులో ముద్దాయిలను హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. ఈ కేసును చేధించిన ఏఎస్ఐ మురళీధర్ రావు పోలీస్ సిబ్బంది ,ఖాదర్ బాషా నారాయణ చెన్నకేశవులు లను డిఎస్పీ అభినందించారు.