అమరావతి రైతుల దీక్షలకు మద్దతుగా టీడీపీ ఆంధ్రుల రాజధాని సమరభేరీ

అమరావతి రైతుల దీక్షలకు మద్దతుగా టీడీపీ ఆంధ్రుల రాజధాని సమరభేరీ
పామూరు అక్టోబర్ 11 (న్యూస్ మెట్) : 12/10/20అమరావతి ఉద్యమం 300 రోజులు అయిన సందర్భంగా జె.ఏ.సీ. పిలుపు “ఆంధ్రుల రాజధాని – సమరభేరి” నిరసన కార్యక్రమం జరిగింది. రాజధాని కి మద్దతుగా సోమవారం పామూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని మార్చాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆయన తెలిపారు. మూడు రాజధానులు పరిపాలనకు విఘాతం కలిగిస్తాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా షిప్ డైరెక్టర్ మోర బోయిన గంగరాజు యాదవ్, పట్టణ అధ్యక్షుడు బొగ్గవరపు వీరభద్రా చారి, మాజీ కో-ఆప్షన్ ఖాజా రహంతుల్లా, ఉగ్రసేన నాయకులు సయ్యద్ ఆమీర్ బాబు, మాజీ ఏఎంసి. డైరెకర్లు మోబిన మౌలాలి , తోట రవి, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పోక నాయుడు, తెదేపా పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *