అమరావతిని రాజధానిగా కొనసాగించాలి డి శ్రీనివాస్

అమరావతిని రాజధానిగా కొనసాగించాలి డి శ్రీనివాస్
ఎర్రగొండపాలెం అక్టోబర్ 12 (న్యూస్ మేట్) : 12/10/20అమరావతిని రాజధానిగా కొనసాగించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మూడు రాజధానులు వద్దు ఓకేరాజధాని ముద్దు అనే నినాదంతో సీపీఐ కార్యాలయం వద్దనుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం తాసిల్దార్ కిరనుకు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అమరావతి ప్రాంత రైతులు 52 వేల ఎకరాలు వారి ప్రాంతం అబివృద్ది చెందుతుందని ఇచ్చారన్నారు.తన పంతం నెగ్గించుకోవడానికి రాజధానిని జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలకు మారుస్తున్నారని అన్నారు.అదేమిటని ప్రశ్నించిన నాయకులను రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.వారుచేస్తున్న న్యాయమైన పోరాటానికి సిపిఐ మద్దతు సంఘీ భావం తెలుపుతుంది అన్నారు.ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి బాణాల రామయ్య,నాగేశ్వరావు,లింగయ్య,మస్తాన్,బ్రహ్మయ్య తదితరులు పాల్గోన్నారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *