విద్యుత్ సమస్యలపై స్పందన కార్యక్రమం

విద్యుత్ సమస్యలపై స్పందన కార్యక్రమం
మార్కాపురం అక్టోబర్ 12 (న్యూస్ మేట్) : 12/10/20సోమవారం మార్కాపురం డివిజన్లో విద్యుత్ సమస్యలపై స్పందన కార్యక్రమం నిర్వహించినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ ప్రసన్న కుమార్ తెలిపారు .ఈ స్పందన కార్యక్రమం లో విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా తెలియజేశారని ఆయన చెప్పారు.. ఫోన్ ద్వారా 14 మరియు వాట్సాప్ ద్వారా ఒక సమస్య వచ్చినవి. అధిక బిల్లులకు సంబంధించి 6 , సర్వీస్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు మరియు లైన్లు సరి చేయుటకు సంబంధించి 9 కంప్లైంట్లు కలిపి మొత్తం 15 సమస్యలు వచ్చినట్లు ఆయన చెప్పారు. వీటిని సంబంధిత అధికారులకు పంపించి త్వరలో ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని ఆయన వెల్లడించారు.

Spread the love
Ad Widget

Recommended For You

About the Author: Newsmate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *