రాజధాని రైతులకు మద్దతు గా సిపిఐ నిరసన
మార్కాపురం అక్టోబర్ 12 (న్యూస్ మేట్) : మూడు రాజధానులు వద్దని, రాష్ట్ర ప్రజల కోరిక మేరకు అమరవతినే రాజధానిగా కొనసాగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అందే నాసరయ్య డిమాండ్ చేశారు. రాజధాని రైతుల పోరాటం 300 రోజులకు చేరిన సందర్భంగా సోమవారం మార్కాపురంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమరావతి పోరాట పరిరక్షణ సమితికి మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో కోర్టు సెంటర్లలో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ విధానం విడనాడి అమరావతి రాజధానిగా కొనసాగించాలని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానులను మూడు గా చేయటం పరిపాలనకు ఏమాత్రం అణువు కాదని ఆయన అన్నారు ,మెజార్టీ ప్రజలు అమరావతి రాజధానిగా కోరుతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రజల అభీష్టాన్ని గౌరవించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో , పట్టణ కార్యదర్శి ఎస్ కె కాశింతో పాటు నాయకులు యమ్ వెంకయ్య, మౌలాలి, రాజారావు తదితరులు పాల్గొన్నారు.